Breaking : మరోసారి తెరపైకి వచ్చిన ఫ్లెక్సీ వార్..? సిద్ధం అంటే సిద్దమే

by Indraja |
Breaking : మరోసారి తెరపైకి వచ్చిన ఫ్లెక్సీ వార్..? సిద్ధం అంటే సిద్దమే
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీకి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం ముదిరి ఫ్లెక్సీ వార్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం అనే పోస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో కూడా వైసీపీ నేతలు సిద్ధం అనే క్యప్షన్ తో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలకు ధీటుగా మేము కూడా సిద్దమే అనే ఫ్లెక్సీలు వెలిశాయి.

ఆంధ్రుల ఆరాధ్య దైవం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఫొటోలతో పాటుగా వంగవీటి రంగ ఫొటోలతో మేము కూడా సిద్దమే మమ్మల్ని ఎవడ్రా ఆపేది అనే క్యాప్షన్ పెట్టి జనసేన నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. అనంతరం ఆ హోర్డింగ్ లను వైసీపీ హోర్డింగ్ ల పక్కన ఏర్పాటు చేశారు.ఇలా వైసీపీ హోర్డింగ్ లకు జనసేన నేతలు హోర్డింగ్ లతోనే కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఈ ఫ్లెక్సీల వార్ ఈరోజు మొదలైనది కాదు.

గతంలోనూ వైసిపి ఫ్లెక్సీ లను జనసేన నేతలు తీసేసి వాళ్ళ పార్టీ హోర్డింగులు పెట్టడం.. అలానే జనసేన హోర్డింగ్లు తీసేసి వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ హోర్డింగ్లు పెట్టడం జరిగింది. ఇక సంక్రాంతి సమయం లోనూ జనసేన నేతలు విజయవాడ హైవే పై పండగ జోరులో స్పీడ్ పెంచేరు ఆంధ్ర రోడ్లు బ్రేక్ వేస్తాయి.. చూసి జాగ్రత్తగా వెళ్ళండి అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీకి కౌంటర్ ఇచ్చిన విషయం అందరికి సుపరిచితమే.

Advertisement

Next Story

Most Viewed