Vinayaka immersion:వినాయకుడి నిమజ్జనంలో జగన్ పాటలు.. షాకిచ్చిన పోలీసులు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-15 08:54:26.0  )
Vinayaka immersion:వినాయకుడి నిమజ్జనంలో జగన్ పాటలు.. షాకిచ్చిన పోలీసులు
X

దిశ,వెబ్‌డెస్క్:ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో వినాయకుని ఉత్సవాలు(Vinayaka festivals) ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల వినాయక నిమజ్జనాలు డిజే సాంగ్స్‌తో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ని కీర్తిస్తూ మైక్‌లో పాటలు(Songs) పెట్టినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక ఉత్సవాలను(Vinayaka festivals) నిర్వహించారు. స్థానిక పోకనాటి వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఈ నెల 13న నిమజ్జనం చేశారు.

అంతకుముందు ప్రారంభమైన ఊరేగింపు సందర్భంగా ‘కావాలి జగన్.. రావాలి జగన్’ అనే పాటలు వేశారు. అనంతరం కొందరు వైసీపీ జెండాలు(YCP flags) ప్రదర్శించారు. అంతేకాదు అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో(cultural events) కూడా వైసీపీ పాటలు(YCP Songs) వేయడంతో వాటిని ఆపాలని స్థానికులు చెప్పిన ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో డీఎస్పీ(DSP), సీఐ(CI) అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘించి ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాజకీయ పాటలు(Political songs) వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed