ప్రధాని నరేంద్ర మోడీతో ముగిసిన జగన్ భేటీ.. ఎనిమిది అంశాలతో వినతి పత్రం అందజేత

by Shiva |   ( Updated:2024-02-09 14:18:07.0  )
ప్రధాని నరేంద్ర మోడీతో ముగిసిన జగన్ భేటీ.. ఎనిమిది అంశాలతో వినతి పత్రం అందజేత
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంటు పరిధిలోని ప్రధాని ప్రత్యేక కార్యాలయంలో నరేంద్ర మోదీతో ఇవాళ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా, విభజన హమీలపై ఆయనతో చర్చించారు. ఈ భేటీలో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి రూ.17,144 కోట్ల నిధుల విడుదలకు సంబంధించి చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి గత మూడేళ్లుగా అంటే 2014 జూన్‌ నుంచి ఏపీ జెన్‌కోనే విద్యుత్‌ సరఫరా చేసిందని పేర్కొన్నారు.

అయితే అందుకు సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా సహా ఇతర విభజన హామీలను అమలు చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఆ కాలేజీలకు మౌలిక వసతులను కల్పించాల్సింది జగన్ కోరారు.

విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కి.మీ 6 లేన్ల రహదారికి అనుమతులు ఇప్పించాలని సీఎం జగన్ కోరారు. విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్‌ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని, ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని పీఎంను సీఎం జగన్ కోరారు. కడప– పులివెందుల– ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం– హిందూపూర్‌ కొత్త రైల్వే లైన్‌ను పనులు చేపట్టాల్సిందిగా అభ్యర్థించారు. ఇక చివరగా విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

Also Read..

జగన్ కు మోడీ దర్శనం దొరికినందుకు అభినందనలు.. ఏం సాదించారో?

Advertisement

Next Story

Most Viewed