చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం కొట్టుకున్నట్టుగా జగన్ తీరు.. సీపీఐ నారాయణ

by Ramesh Goud |
చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం కొట్టుకున్నట్టుగా జగన్ తీరు.. సీపీఐ నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ (Former CM Jagan) తీరు చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం కొట్టుకున్నట్టు ఉందని, ప్రజలు ఘోరంగా ఓడించిన తర్వాత ప్రతిపక్ష హోదా (Opposition) అడగడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) ఎద్దేవా చేశారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఏపీ రాజకీయాలపై (AP Poitics) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ కు ఎమ్మెల్యే పదవిలో (MLA Post) ఉండే అర్హతే లేదని, ఆయన వెంటనే రాజీనామా (Resign) చేయాలని డిమాండ్ (Demand) చేశారు.

అంతేగాక ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే.. వారికే అందుబాటులో ఉండకపోవడం ఏంటని, ప్రజలకు అందుబాటులో లేని వైసీపీ ఎమ్మెల్యేలంతా (YCP MLA's) రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం (Previous YCP Government) రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా అని, రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారికి వదిలి పెట్టొద్దని, జైలుకు పంపాలని కోరారు. అంతేగాక ప్రజా ధనాన్ని దోచేసిన వారంతా బయటే తిరుగుతున్నారని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని (Pedhireddy Ramachadra Reddy) ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. ఇక జగన్ యువత కోసం పోరు చేస్తుండటం హాస్యాస్పందంగా ఉందని, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే అడవి లో నుంచి ఇప్పుడే జనంలోకి వచ్చినట్టు ఉందని చెప్పారు.

అలాగే ట్రంప్ (Trump) బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తుంటే.. మోడీ (PM Modi) దేశ గౌరవాన్ని ఆయనకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ (BJP Party) బలం.. మోడీ వ్యక్తిగత ఓట్లు తగ్గిపోయాయని విమర్శలు చేశారు. ఇక ఆప్ (AAP) ఓటమికి మోడీ బ్లాక్ మెయిల్ రాజకీయాలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆడవాళ్లు ఉత్పత్తి యంత్రాల్ల కనిపిస్తున్నారా అంటూ.. బిడ్డల్ని కనమని చెప్పడం సరైన పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హిందీ భాష (Hindi Luanguage)ను బలవంతంగా దక్షణాది రాష్ట్రాలపై రుద్దాలను కోవడం మోడీ అహంకారానికి నిదర్శనమని సీపీఐ నేత వ్యాఖ్యానించారు.

Next Story