- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: అందుకు జగన్మోహన్ రెడ్డి సహకరించాలి.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే
దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు అమరావతి లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తొలి నుండి జగన్ పై ఏవైతే వాస్తవాలు చెబుతున్నామో అవి నిజమని ఆయన సొంత రక్తం పంచుకుపుట్టిన ఆయన సోదరి షర్మిలనే తెలియజేస్తోంది అని తెలిపారు. ఇందుకు సాక్ష్యం ఈ మధ్య కడపలో జరిగిన ప్రెస్ మీట్ లో భారతి రెడ్డితో చెప్పిస్తారా అంటూ షర్మిల జగన్ ను నిలదీయడమే అని వ్యాఖ్యానించారు.
ఇక భారతి రెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీయ్యడంతోనే.. జగన్ అవినీతి మొత్తం బయటకి వచ్చిందని మండిపడ్డారు. ఇక తాము జగన్ కి సంబంధించిన వాస్తవాల గురించి మాట్లాడితే రాజీకీయంగా కట్టుకథలు అల్లుతున్నారు అన్నారని.. మరి ఇప్పడు సొంత చెల్లినే చెబుతోంది దీనికి మీరు ఏం చెబుతారు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు..?
ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ అవాస్తవాలు అని తేలిపోయిందిగా జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఏం అంటారు మీరు.. ఇప్పటికీ జగన్ తన అబద్దాలను ఒప్పుకొక్కపోతే జగన్ కు లై డిటెక్టర్ పరీక్ష చెయ్యాలని డిమాండ్ చేసారు. లై డిటెక్టర్ టెస్ట్ కు నువ్వు కూడా సహకరించాలి జగన్ అంటూ వ్యాఖ్యానించారు. జగన్ పైన 12 కేసులు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో తాను 18 నెలలు జైల్ ల్లో ఉన్నారని.. బెయిల్ పైన బయటకు వచ్చే అవకాశం కూడా లేని పక్షంలో జగన్ భార్య భారతి రెడ్డి, బావమరిది అనిల్ సోనియా గాంధీని కలిసి ఆమె కాళ్ళ పైన పడితే జగన్ కు బెయిల్ వచ్చిందని షర్మిల చెబుతోంది.
దీనికి నువ్వేంమంటావు జగన్ అని ఉమామహేశ్వరరావు నిలదీశారు. ఇక తాడేపల్లిలో కూర్చొని.. షర్మిలను, తమను తిట్టించడం కాదని.. నిజంగా ప్రజల సంక్షేమమే కోరుకుంటే.. నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలే అయితే లై డిటెక్టర్ పరీక్షకు రా అని జగన్ కు ఉమామహేశ్వరరావు సవాల్ విశారు.