- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ , డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి అంశాలపై ఇరు రాష్ట్రాల నాయకులు విమర్శలు దాడికి పాల్పడేవారు. అయితే ఇలాంటి తరుణంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి మంచి జరగాలంటే పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి. ఎక్కడి వారికి అక్కడ రావాలి అని కోరారు. రాంపూర్ ఐటీ పార్క్‌లో శుక్రవారం క్వాడ్రంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రారంభించారు. ‘వరంగల్ ఎన్నారైలు కూడా ముందుకు రండి. మీకు కూడా స్థలాలు ఇస్తాం. మీరు కూడా క్యాంపస్‌లు పెట్టి వరంగల్ పిల్లలకు అవకాశం కల్పించండి. అందర్నీ బ్రహ్మాండంగా కలుపుకొని ముందుకు పోవాలి. రాబోయే పదేండ్లలో హైదరాబాద్, వరంగల్‌కు తేడా ఉండదు. ఐటీ రంగంలో భవిష్యత్ అంతా టైర్ 2 నగరాలదే’ అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
ఏపీలోనూ పెట్టుబడులు పెట్టాలి
వరంగల్‌లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకు కూడా ఐటీ సంస్థలు రావాలి అని కేటీఆర్ ఆకాంక్షించారు. అక్కడా ఐటీ సంస్థలను పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో భవిష్యత్‌లో గొప్ప ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.ఈ మేరకు క్వాడ్రంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమానులకు కేటీఆర్ సూచించారు. కావాలంటే జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తాను అని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇకపోతే బెంగళూరు ఐటీ రంగంలో 40 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారే ఉన్నారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఉన్నచోటే యువతకు ఉపాధి దక్కాలి. కులం, మతం పేరుతో కొట్టుకుచావడం మానాలి అని ఐటీ మినిస్టర్ కేటీఆర్ అన్నారు. ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ పరిశ్రమలు పెట్టాలని కేటీఆర్ ఆకాంక్షించారు.