నిద్రలేని రాత్రులు గడుపుతున్న జగన్...బాబాసాహేబ్‌కు రక్షణ కల్పించండి : Achchennaidu..

by Seetharam |   ( Updated:2023-08-13 14:12:20.0  )
నిద్రలేని రాత్రులు గడుపుతున్న జగన్...బాబాసాహేబ్‌కు రక్షణ కల్పించండి : Achchennaidu..
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఏ ఎన్నికలైనా ఏక పక్షంగా జరిగిపోవాలన్నదే ఫ్యాక్షనిస్టుల నైజం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో దాగిన ఫాసిజం పడగలు ఏపీలో ప్రమాద ఘటికలు మొగిస్తున్నాయి అని ఆరోపించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పాతపాడులో 5వ వార్డుకు నామినేషన్ వేసిన బాబాసాహెబ్‌పై వైసీపీ నాయకులు దాడి చేసి విత్ డ్రా చేసుకోవాలని బెదిరింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గం అని అన్నారు. ఇడుపులపాయ నుంచి రాష్ట్రం మొత్తం వార్డు సభ్యున్ని కూడా గెలిపించుకోలేని స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారన్నారు. ఓటమి భయంతో తాడేపల్లి ప్యాలెస్‌లో నిద్రలేని రాత్రులను గడుపుతున్నారన్నారు. ఏ నియంత పాలనలోనూ కనిపించని దౌర్జన్య కాండను జగన్ రెడ్డి రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్న జగన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని హెచ్చరించారు. బాబాసాహేబ్ పై దాడి చేసిన వైసీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాబాసాహేబ్‌కు రక్షణ కల్పించాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను ఎన్నికల సంఘం పరిశీలించి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలి అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story