ఎన్టీఆర్ ను చంద్రబాబు కంటే తాను ఎక్కువ గౌరవిస్తా.. జగన్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-21 07:35:40.0  )
ఎన్టీఆర్ ను చంద్రబాబు కంటే తాను ఎక్కువ గౌరవిస్తా.. జగన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తాను వ్యతిరేకంగా ఎన్టీఆర్ కు ఎప్పుడూ మాట్లాడలేదని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు కంటే తాను ఎక్కువ గౌరవిస్తానని చెప్పారు. ఎన్టీఆర్ పేరు పలకడం కూడా చంద్రబాబు ఎక్కువ ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యులు గొడవ చేయడానికి అసెంబ్లీకి వచ్చారని జగన్ ఆరోపించారు. వైసీపీ తరపున ఎన్టీఆర్ ను అసలు ఒక్క మాట కూడా అనలేదన్నారు. మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందని, పాదయాత్రలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని జగన్ చెప్పారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని జగన్ ప్రశ్నించారు. కాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Also Read: వైఎస్సార్‌కు అసలు ఏం సంబంధం? ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై చంద్రబాబు ఆగ్రహం



Next Story

Most Viewed