- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వెన్నుపోటు పొడిచేవాళ్లను నమ్మొద్దంటూ.. చంద్రబాబుపై జగన్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.8 లక్షల తల్లుల ఖాతాల్లో దాదాపు రూ.912 కోట్లను నేరు జమ చేస్తున్నామన్నారు. చదువు కుటుంబ చరిత్రనే కాదు.. ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుందన్నారు. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పు చేయకుడదన్నదే తమ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన చదువు కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలు అందిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. పేద పిల్లలు పేదలుగానే మిగిలిపోవాలని గతంలోని పెత్తందారి ప్రభుత్వం భావించిందన్నారు. మన ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో డ్రాప్ అవుట్లు తగ్గాయన్నారు. చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. వెన్నుపోటు దారులను, మాయమాటలు చెప్పేవారిని నమ్మెుద్దన్నారు. పులి కథ చెబుతూ బాబుపై సెటైర్లు వేశారు. జాతీయ మీడియాకు ఒక ముసలాయన ఇంటర్వూ ఇచ్చారని అది చూస్తే తనకు పంచతంత్రం కథలు గుర్తొచ్చాయన్నారు. రాబోయే కురుక్షేత్రంలో మీ దీవెనలు కావాలన్నారు.