- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరువు విలయతాండవం జగన్‌కు కనిపించడం లేదా?: Daggubati Purandeswari
దిశ, డైనమిక్ బ్యూరో : అనంతపురం జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుందని ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కనిపించడం లేదా అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన దగ్గుబాటి పురంధేశ్వరి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో రైతులకు అనే హామీలు ఇచ్చారని...వాటిని పూర్తిస్థాయిలోఅమలు చేయలేదని ఆరోపించారు. ఇవాళ బటన్లు నొక్కుతూ రైతులను, ప్రజలను వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 3 లక్షల 45 వేల ఎకరాలకు సాగు, తాగు నీరు అందిస్తామన్న వైఎస్ జగన్ హామీ ఏమైందని నిలదీశారు. ఇకపోతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం, పుంగనూరు ప్రాంతాలకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామన్న వైఎస్ జగన్ అలాంటివి ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని నిలదీశారు. బటన్ నొక్కుతూ ప్రజలను, రైతులను సీఎం వైఎస్ జగన్ నిండా ముంచుతున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు.