- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
APలో టాప్-10లో ఒక్క యూనివర్సిటీ లేకపోవడం బాధాకరం: సీఎం చంద్రబాబు
దిశ,వెబ్డెస్క్:ఏపీ రాజధాని అమరావతిలో నేడు(సోమవారం) జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించారు. ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యార్థులు నైపుణ్యాలను పెంచే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..ఏపీలోని యూనివర్సిటీల పరిస్థితి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గతంలో నాక్ అక్రెడిటేషన్లో ఏపీ విశ్వవిద్యాలయాలు టాప్-10లో ఉండేవని, కానీ ఇప్పుడు ఏపీకి చెందిన ఒక్క వర్సిటీ కూడా టాప్-10లో లేకపోవడం బాధాకరమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలని చంద్రబాబు సూచనలు జారీ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలు సాధించేలా శిక్షణ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్చువల్ వర్కింగ్ కోసం ఓ విధానం రూపొందించాలని, రాష్ట్రం వర్చువల్ వర్కింగ్ హబ్ గా అవతరించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.