- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీకలేరు నుంచి పీకేసినా పర్వాలేదు అనే దాకా.. ట్విట్టర్ లో టీడీపీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ సీఎం జగన్ నిన్న ఇండియా టుడే చిట్ చాట్ లో నోరుజారిన మాటను ఆధారంగా చేసుకొని ట్విట్టర్ లో టీడీపీ ఓ పోస్టు షేర్ చేసింది. దీనికి పీకలేరు నుంచి పీకేసినా పర్వాలేదు అనే దాకా..! అనే కొటేషన్ జత చేసింది. అయితే దీనిలో ఏముంది అంటే.. జగన్ 2021 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం తాను అన్న మాటలు.. పేపర్లలో వచ్చిన కటింగ్స్ ను జత చేసి ఉంచారు. ఇందులో 2021 లో నా వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్, 2022 నుంచి నన్నే నమ్మండి అని అంటున్నట్లు, ఇక 2023 కి వచ్చే సరికి మిమ్మల్నే నమ్ముకున్నా అంటూ దిగజారిపోయి, 2024 లో హ్యపీగా దిగిపోతా అనే స్టేజీకి వచ్చారని పోస్టు చేసింది. ఇంకా ఈ పోస్టుకు జగన్ పని అయిపోయింది, 2024 జగన్ నోమోర్ అనే పలు హ్యష్ ట్యాగ్ లను జత చేసింది. దీంతో ఈ పోస్టును సూచిన టీడీపీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. అంతేగాక జగన్ ముందే ఒప్పేసుకున్నాడు, రియలైజేషన్ అంటే ఇదే అని పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు.