Nandamuri Fans : నందమూరి అభిమానుల్లో రచ్చ రేపిన బాలయ్య యాడ్ ?

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-29 09:08:11.0  )
Nandamuri Fans : నందమూరి అభిమానుల్లో రచ్చ రేపిన బాలయ్య యాడ్ ?
X

దిశ, వెబ్ డెస్క్ :టాలీవుడ్ సీనియర్ హీరో..హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కు పద్మ విభూషణ్ (Padma Vibhushan)అవార్డు వచ్చిన సందర్భంలో అభినందనలు తెలుపుతూ ఇచ్చిన పత్రిక ప్రకటన(News Paper Advertisement) నందమూరి వంశాభిమానుల్లో రచ్చ(Riot)రేపింది. నందమూరి, నారా కుటుంబాల పేరుతో ఇచ్చిన ప్రకటనల్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు లేకపోవడం నందమూరి అభిమానుల్లో చర్చనీయాంశమైంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మీద ఎందుకింత వివక్ష అంటూ వారి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు వారికి ఇలాంటి అవమానాలని..వారిని ఇంకెంతకాలం దూరం పెడుతారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్యకు అభినందనలతో జారీ కాబడిన పేపర్ ప్రకటన నందమూరి కుటుంబంలో విబేధాలకు నిదర్శనమని..ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల చూపుతున్న వివక్షతకు ఈ ప్రకటన అద్ధం పట్టిందని అభిమానులు చర్చించుకుంటున్నారు. అలాగే ప్రకటనలో కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీఆర్ ల తండ్రి హరికృష్ణ పేరుతో సతీమణిగా లక్ష్మి పేరు పెట్టగా..జూనియర్ ఎన్టీఆర్ తల్లి పేరు మాత్రం పెట్టకపోవడాన్ని జూనియర్ అభిమానులు ఎత్తి చూపుతున్నారు. ఈ వ్యవహారం చూస్తే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా స్టోరీ గుర్తు కొస్తుందని..ఆ సినిమా స్టోరీ అంతా కూడా ఇంటిపేరు మీదనే సాగిందంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కాగా బాలయ్య అభినందన ప్రకటనలో దివంగత తారకరత్న పేరు కూడా పెట్టనప్పటికి ఆయన తల్లిదండ్రులు నందమూరి మోహన కృష్ణ, శాంతిల పేర్లు పెట్టడం గమనార్హం. హరికృష్ణ కుమార్తె నందమూరి సుహసిని పేరు కూడా అందులో పెట్టలేదు.

మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి, నారా కుటుంబాలు తమకు అవసరమైనప్పుడు దగ్గర తీసి..తర్వాతా వదిలేస్తూ అవకాశవాద వైఖరితో వ్యవహరిస్తున్నారని జూనియర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. బాలయ్య అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా పలికేందుకు ఇష్టపడటం లేదని..ఆహా ఎపిసోడ్స్, సినిమా ఈవెంట్లు, సక్సెస్ మీట్లు సైతం ఇందుకు నిదర్శనమంటున్నారు. గత ఏడాది దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ధ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగించమనడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం నందమూరి కుటుంబంలో విబేధాలను చాటింది. ఆ వివాదం బాబాయ్ వర్సెస్ అబ్బాయిగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఏన్టీఆర్ వర్థంతి సందర్భంగా బాలయ్య రాక ముందు తెల్లవారుజామున కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు.

Next Story

Most Viewed