ఇంట్రెస్టింగ్‌గా ఏపీ రాజకీయం.. క్వశ్చన్ పేపర్లతో వైసీపీ,జనసేన ఫైట్!

by Disha Web Desk 18 |
ఇంట్రెస్టింగ్‌గా ఏపీ రాజకీయం.. క్వశ్చన్ పేపర్లతో వైసీపీ,జనసేన ఫైట్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు 25రోజులే ఉండడంతో ఓటర్లను ఆకర్షించే దిశగా అన్ని పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. ప్రచారంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ,జనసేన మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే..వైసీపీ, జనసేన క్వశ్చన్ పేపర్ల రూపంలో సోషల్ మీడియాలో విమర్శలు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ 12వ తరగతి ఫెయిల్ అంటూ వైసీపీ ఒక క్వశ్చన్ పేపర్ ట్వీట్ చేసింది. ఆ క్వశ్చన్ పేపర్‌లో ప్రశ్నలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ పేపర్‌లో ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నావ్? చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలిశావ్? అని ప్రశ్నలు వేసింది. దీనికి కౌంటర్ గా జనసేన జగన్ పేరుతో ఓ క్వశ్చన్ పేపర్ విడుదల చేసింది. ఖరీదైన దోపిడీ ఏది? ఎగ్గొట్టిన హామీ ఏది? అని ప్రశ్నలతో సెటర్లు వేసింది. ప్రజెంట్ ఈ క్వశ్చన్ పేపర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Next Story