Interesting Evolution: వ్యూహాత్మకంగా అడుగులు.. పొత్తులు దిశగా చర్చలు..!

by srinivas |
Interesting Evolution: వ్యూహాత్మకంగా అడుగులు.. పొత్తులు దిశగా చర్చలు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పొత్తులపై ఇరు నేతల మధ్య చర్చ జరిగిందనే ప్రచారం జరుగుతుంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్తున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వనని ప్రకటించారు.


ఇకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీపై కలిసి పోరాటం చేద్దామని కూడా చంద్రబాబు నాయుడు పార్టీలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 2014 ఎన్నికల మాదిరిగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇదే కూటమికి చంద్రబాబు నాయుడు సైతం జై కొట్టారు. అయితే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం పొత్తుకు నిరాకరిస్తుంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed