AP Elections 2024: జయహో బీసీ సదస్సులో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

by Indraja |
AP Elections 2024: జయహో బీసీ సదస్సులో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు హోరందుకుంది. పార్టీలు ప్రచారాలతో బిజీగా ఉన్నారు. కొందరు నాయకులు పార్టీలు మారుతున్నారు. చీలికలు, చేరుపులతో ఏపీ రాజకీయాలు వాడివేడితో సాగుగుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. సదస్సులను ఏర్పాటు చేసి అన్ని వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. తాజాగా ఓ సదస్సులో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వివరాలలోకి వెళ్తే.. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం NTR భవన్‌లో జయహో బీసీ రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించారు. మొదటగా ఎన్టీఆర్ అలానే జ్యోతిరావుపూలే విగ్రహాలకు నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీలు బలహీనులు కాదు, బలవంతులనే నినాదంతో ఈ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మొదటి నుండి బీసీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించారు.

సమాజంలో సగభాగమైన బీసీలను వైకాపా పార్టీ వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైకాపా పరిపాల లోకి వచ్చాక బీసీలకు ఎంతో అన్యాయం జరిగిందని.. 3వందల మంది బీసీలను పొట్టనబెట్టుకున్నారని.. వందలాదిమందిపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల క్షేమం కోరి మంజూరు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను, 30కి పైగా పథకాలను రద్దుచేసి బీసీలను ఆర్థికంగా ఎదగకుండా అణగదొక్కారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను సైతం తగ్గించి వేలాదిమంది బీసీలకు రాజకీయ అవకాశాలు లేకుండా చేసారని వ్యాఖ్యానించారు. అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు ఇన్‌ఛార్జుల మార్పుల విషయంలోనూ బడుగులకే తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగు దేశం పార్టీ అధికారం లోకి రాగానే బీసీల జోలికి రావాలంటేనే భయపడేలా బీసీ రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. అలానే బీసీల అభివృద్దే తమ ధ్యేయమని.. బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతస్థానాలకు తీసుకువెళ్లేలా కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story