- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల సంఘం ఫ్లెక్సీలో జాతీయ జెండాకు అవమానం!
దిశ, డైనమిక్ బ్యూరో: ఆదోని నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగ్ లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు రోడ్డుకు ఇరువైపుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓటు వేయడం మన హక్కు అంటూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ ఫ్లెక్సీలో జాతీయ జెండాను తప్పుగా ముద్రించారు. ఈ ఫ్లెక్సీ డిస్ ప్లేలో జాతీయ జెండాలోని ఆకుపచ్చరంగును పైకి, కాషాయ రంగును కింద ఉండేలాగా తారుమారుగా ముద్రించారు.
ఇదే విధంగా నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన అన్నీ ఫెక్సీల్లో తప్పుగానే ముద్రించారు. ఎన్నికల సంఘం ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇది చూసిన వారు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఫెక్సీలో జాతీయ జెండాను అవమానపరచం ఏంటని, దీనికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు్న్నారు. వెంటనే వీటిని తొలగించి, వాటి స్థానంలో కొత్తవి ముద్రించి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.