- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Inquiry: కడప జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. ఎంక్వైరీకి ఆదేశించిన కూటమి సర్కార్

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ జగన్ (YS Jagan) చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి (Dastagiri)ని కడప జైలు (Kadapa Jail)లో బెదిరింపులకు గురి చేయడం, ప్రలోభపెట్టిన ఘటనపై కూటమి సర్కార్ ఎక్వైరీకి ఆదేశించింది. ఈ మెరకు ఎంక్వైరీ ఆఫీసర్‌గా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ (Superintendent of Rajahmundry Central Jail Rahul)ను నియమించింది. శుక్రవారం ఉదయం కడప జైలు (Kadapa Jail)లో దస్తగిరి (Dastagiri)ని విచారణ అధికారిని ప్రశ్నించనున్నారు. అతడి విచారణ ముగిసిన వెంటనే చైతన్య రెడ్డి (Chaitanya Reddy), ప్రకాశ్ రెడ్డి (Prakash Reddy)లను కూడా ప్రశ్నించనున్నారు. అయితే శుక్రవారం, శనివారం కడప జైలు (Kadapa Jail)లో విచారణ కొనసాగనుంది.
కాగా, దస్తగిరి ఫిర్యాదుతో ఇప్పటికే వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (Devireddy Shiva Shankar Reddy) కుమారుడు డా.దేవిరెడ్డి చైతన్య రెడ్డి (Devireddy Chaitanya Reddy) పాటు కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఐఎన్‌ఎస్ ప్రకాశ్ (INS Prakash), జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు (SP Nagaraju), ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య (CI Eshswaraiah)లపై కేసులు నమోదయ్యాయి. అక్రమ నిర్బంధం, నేరపూరిత బెదిరింపు, ఉద్దేశపూర్వక దాడి, హాని కలిగించటం, తప్పుడు సాక్ష్యాలివ్వాలని బెదిరించటం తదితర అభియోగాలు వారిపై పోలీసులు కేసులు బుక్ చేశారు. అదేవిధంగా 2023 అక్టోబరు, నవంబరు నెలల్లోనే తనను బెదిరించారని అప్పట్లో దస్తగిరి, ఆయన భార్య పలుమార్లు చెప్పినప్పటికీ ఆనాడు వైసీపీ అధికారంలో ఉండటంతో కేసు నమోదు కాలేదు. ప్రస్తుతం ఆనాడు జరిగిన ఘటనపై ఆనాటి ఘటనపై దస్తగిరి రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశారు. దీంతో పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిబ్రవరి 5న కేసు నమోదైంది.