AP Rains: తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం.. రాజమండ్రి లోతట్టు ప్రాంతాలు జలమయం

by Mahesh |   ( Updated:2024-09-04 14:52:09.0  )
AP Rains: తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం.. రాజమండ్రి లోతట్టు ప్రాంతాలు జలమయం
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్(Andrapradesh) రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో వరదలు వచ్చాయి. ముఖ్యంగా విజయవాడ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తగా నేటికి సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ వరదల నుంచి తీసుకుంటున్న సమయంలో.. మరోసారి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి తూర్పు గోదావరి(East Godavari district) జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. దీంతో రాజమండ్రి(Rajamandry) లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేని వర్షం, మరోవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో కంభాల చెరువు, శ్యామల సెంటర్ ముంపులో చిక్కుకున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో ఆదెమ్మ దిబ్బ, తుమ్మలోవ, కోర్లమ్మపేట ముంపునకు గురయ్యాయి. కాగా రాజమండ్రిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఇవాళ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed