పలమనేరులో కోర్టు నూతన భవనాలు ప్రారంభం

by Anil Sikha |
పలమనేరులో కోర్టు నూతన భవనాలు ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో : చిత్తూరు జిల్లా పలమనేరులో రూ.15.18 కోట్ల తో నూతనంగా నిర్మించిన నాలుగు కోర్టు భవనాలను, జడ్జిల నివాస భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ఇవాళ ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తలు జస్టిస్ బి.కృష్ణ మోహన్, జస్టిస్ టి.సి.డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. న్యాయమూర్తులకు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణి కంఠ చందోలు స్వాగతం పలికారు. సర్వమత ప్రార్థనల చేసిన అనంతరం భవనం ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావ్, పలువురు స్థానిక కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు

Next Story