- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ కోట.. పగిలింది
- సొంత జిల్లా కడపలో 3 స్థానాలకే పరిమితమైన వైసీపీ
- తగ్గిన అవినాష్, జగన్ మెజారిటీలు
- విస్మయానికి గురైన పార్టీ శ్రేణులు
దిశ ప్రతినిధి, కడప: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి ఎదురులేకుండా ఎన్నికల ఫలితాలు కొనసాగాయి. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనుహ్యంగా ఫలితాలు రావడంతో జగన్‌ను ఢీకొనడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడుతూ వచ్చింది. సొంత జిల్లాను కంచుకోటలా మలుచుకున్న జగన్ కోటను ఈ ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమి బద్దలు కొట్టింది. పదికి పది స్థానాలు లెక్కేసుకుంటున్న వైసీపీ శ్రేణులు విస్మయానికి గురయ్యారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా సాగింది. 2009 ఎన్నికల్లో కూడా ఆయనకే అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. 2014 లో జగన్మోహన్ రెడ్డి ఒక్క అసెంబ్లీ స్థానం తప్ప అన్నింటితో పాటు రెండు పార్లమెంటు లను కైవసం చేసుకున్నారు. రెండువేల 2019 ఎన్నికల్లో అయితే పదికి పది స్థానాలను, రెండు పార్లమెంట్ లను అత్యధిక మెజార్టీ దక్కించుకున్న చరిత్ర ఆ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉన్నా సొంత జిల్లాలో ఆయనకు సానుకూలంగా ఫలితాలు వస్తాయని ఊహించారు. అయితే 10 స్థానాల్లో కేవలం మూడు అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులను డీలాకు గురిచేసింది.
మూడంటే మూడే..
ఉమ్మడి కడప జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బద్వేల్ నుంచి డాక్టర్ సుధా, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథరెడ్డి లు మాత్రమే గెలుపొందారు. మిగతా ఏడు చోట్లా కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. కూటమి నుంచి జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విజయం సాధించగా, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, కమలాపూరం నుంచి పుత్తా చైతన్య రెడ్డి, కడప నుంచి మాధవి రెడ్డి, రాయచోటి నుంచి రాంప్రసాద్ రెడ్డి, రైల్వేకోడూరు నుంచి జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ విజయం సాధించారు .దీంతో జిల్లా ఏడు స్థానాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తగ్గిన జగన్, అవినాష్ మెజార్టీ
ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఎక్కువ స్థానాలు కోల్పోవడమే కాకుండా ఆయన మెజార్టీని కూడా కొంత కోల్పోయారు. 2019 ఎన్నికల్లో 90,110 ఓట్ల మెజార్టీ రాగా ఈ ఎన్నికల్లో 61 వేల 687 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఆయన సోదరుడు కడప ఎంపీ అభ్యర్థిగా గెలిచిన అవినాష్ రెడ్డి 2019 ఎన్నికల్లో 3,80,7 26 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా ఈ సారి 64,502 మెజార్టీతో సరిపెట్టుకున్నారు. జిల్లాలో గెలిచిన అభ్యర్థులను పరిశీలిస్తే బద్వేల్ నుండి వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా 18567 ఓట్లతో గెలుపొందారు. కడప నుంచి టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి 18,860 ఓట్లతో గెలుపొందారు. కమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థి చైతన్య రెడ్డి 25,627 ఓట్లతో గెలుపొందారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ నుంచి దేశం అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి 22,744 ఓట్లతో గెలుపొందారు. మైదుకూరు నుంచి దేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,950 ఓట్లతో గెలుపొందారు. వీరితో పాటు రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డి, రైల్వేకోడూరు నుంచి జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ గెలుపొందారు.
రెండు పార్లమెంటు స్థానాలూ వైసీపీకే
ఉమ్మడి జిల్లాలో వైసీపీ అసెంబ్లీ సీట్లు కోల్పోయినా కడప, రాజంపేట పార్లమెంటు సీట్లు మాత్రం కైవసం చేసుకుంది. రెండు చోట్ల మెజార్టీ తగ్గినా కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసిన మిథున్ రెడ్డి గెలుపొందారు.