10th exam results-2025:పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల పై కీలక అప్‌డేట్!

by Jakkula Mamatha |
10th exam results-2025:పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల పై కీలక అప్‌డేట్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 17వ తేదీన ప్రారంభమై ఈ నెల(ఏప్రిల్) 1వ తేదీతో ముగిశాయి. ఈ క్రమంలో ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయో అని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల(ఏప్రిల్) 3వ తేదీన ప్రారంభమై 9వ తేదీన ముగిసింది.

ఈ నేపథ్యంలో ఏపీ(Andhra Pradesh)లో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల(10th exam results-2025) విడుదలకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్ లో ఎంటర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 22వ తేదీన పది పరీక్ష ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులు bse.ap,gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి ఎంటర్ అయ్యాక విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

Next Story

Most Viewed