violence in AP: ఆంధ్రాలో చల్లారని అల్లర్లు.. ఆ జిల్లాలో 144 సెక్షన్ అమలు

by Indraja |   ( Updated:2024-05-15 11:01:15.0  )
violence in AP:  ఆంధ్రాలో చల్లారని అల్లర్లు.. ఆ జిల్లాలో 144 సెక్షన్ అమలు
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో రాజుకున్న కక్షల జ్వాల ఎన్నికలు ముగిసినా చల్లారడం లేదు. ముఖ్యంగా పౌరుషాల పోరు గడ్డగా పేరుగాంచిన పల్నాడు గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉంది. అయుతే తాజాగా జరిగిన ఎన్నికల నేపథ్యంలో మరచిపోయిన రక్తం వాసన మళ్ళీ గుర్తుకొచ్చింది. ఈ క్రమంలో దాడులు, ప్రతిదాడులతో పల్నాడులో హింసాత్మకంగా మారింది.

కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లి కురుక్షేత్ర రణరంగాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. గుంపులుగా బయట తిరిగినా...రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కాగా టీడీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫిర్యాదు మేరకు ఈసీ పారామిలటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో డీజీపీ పారామిలటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు పంపారు. అలానే పట్టణంతోపాటు, గ్రామాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, దాదాపు వెయ్యిమంది అదనపు బలగాలను శాంతిబధ్రతల సంరక్షణకు పల్నాడు జిల్లాకు తరలించారు.

Advertisement

Next Story