- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవ్వరినీ మర్చిపోను.. పోలీసులపై పవన్ హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన సిబ్బంది నివాసాలపై సోదాల పేరుతో దాడులు చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు జనసేనలో చేరడంపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు డైలాగులు కొడుతూ.. రెచ్చిపోతున్నారని, ఒక సంస్కృత శ్లోకం ఇస్తే సరిగ్గా నోరు కూడా తిరగదని, వీళ్లు బ్యాక్ గ్రౌండ్ లో రీరికార్డంగులు వేసుకొని పంచ్ డైలాగులు కొడుతున్నారని, అన్నింటికి త్వరలోనే సమాధానం చెబుతామని అన్నారు.
నా స్టాఫ్ దగ్గరకి పోలీసులు వచ్చి బయపెట్టే ప్రయత్నం చేశారని, జగన్ ఇది 2009 కాదు. 2024 అని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అలాగే నిన్న రాత్రి జరిగిన సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులకు చెబుతున్నానని, మీరు సెర్చ్ వారెంట్ లేకుంటా మా పరిధిలోకి వచ్చారని, పాలిటిక్స్ లో ఇవన్నీ సహజమే అంటే ఒప్పుకోనని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పున:రుద్దరించాలని కోరుతున్నానని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కొమ్ము కాస్తామంటే ఊరుకునేది లేదని, మా ప్రభుత్వం వచ్చాక ఎవ్వరినీ మర్చిపోయే వ్యక్తిని కాదని హెచ్చరించారు. మీరు ప్రజాస్వామ్య బద్దంగా ఉంటే చాలా గౌరవిస్తానని, నేను బయపడే వ్యక్తిని కాదని గుర్తుంచుకోవాలన్నారు. అన్నింటికి సిద్దపడే వచ్చానని, నాతో గొడవ పెట్టుకుంటే ఒక్కడే తేలాలని, రెండోవాడు బయటకి రాడని, అది మీరే అవుతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.