లోకేశ్ పాదయాత్రలో ఐ ప్యాక్ టీం హల్‌చల్?

by Seetharam |   ( Updated:2023-07-19 06:31:52.0  )
లోకేశ్ పాదయాత్రలో ఐ ప్యాక్ టీం హల్‌చల్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే బుధవారం ఉదయం లోకేశ్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. అయితే యువగళం పాదయాత్రలో కొత్త వ్యక్తులు దర్శనమివ్వడం ఒక్కసారిగా కలకలం రేపింది. యువగళం పాదయాత్రలో కనిపించిన కొత్త ముఖాలు ఐప్యాక్ సభ్యులేని టీడీపీ చెప్తోంది. పాదయాత్ర వివరాలను ఐప్యాక్ సభ్యులు బయటకు చేరవేస్తున్నారంటూ టీడీపీ ఆరోపించింది. పాదయాత్రలో కనిపించిన కొత్త ముఖాలను పట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నించగా ఒకరు దొరికారు. మిగిలిన సభ్యులు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ కొత్తముఖాలు ఎవరో కాదని ఐప్యాక్ సభ్యులు అని టీడీపీ స్పష్టం చేస్తోంది. కనిగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రపై ఐప్యాక్ సభ్యులు నిఘా పెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనమంటూ టీడీపీ మండిపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed