HUDCO Fund: అమరావతికి భారీ గుడ్ న్యూస్.. రూ.11 వేల కోట్ల హడ్కో రుణం విడుదల

by Shiva |
HUDCO Fund: అమరావతికి భారీ గుడ్ న్యూస్.. రూ.11 వేల కోట్ల హడ్కో రుణం విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (HUDCO) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపినట్లుగా మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) ఇవాళ వెల్లడించారు. ముంబై (Mumbai)లో జరిగిన హడ్కో బోర్డు (HUDCO Board) సమాశంలో హడ్కో తమ నిర్ణయాన్ని వెల్లడించినట్లుగా ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం (YCP Government) అమరావతి (Amaravati) రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేని పరిస్థితిని కల్పించిందన్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కూడా అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయిస్తోందని నారాయణ పేర్కొన్నారు.

Next Story

Most Viewed