‘పవన్‌కు ఎంత మంది స్ఫూర్తి?’.. డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ మంత్రి సెటైర్లు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-14 14:38:40.0  )
‘పవన్‌కు ఎంత మంది స్ఫూర్తి?’.. డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ మంత్రి సెటైర్లు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ స్పందిస్తూ సెటైర్లు వేశారు. పవన్‌కు ఎంత మంది స్ఫూర్తి? అని ఆయన ప్రశ్నించారు. చేగువేరా తనకు స్ఫూర్తి అని గతంలో పవన్ చెప్పారని.. ఇప్పుడేమో చంద్రబాబు తనకు స్ఫూర్తి అంటున్నారని ఎద్దేవా చేశారు.

నిన్నమొన్నటి వరకు సనాతన ధర్మం పేరుతో డ్రామాలాడారని మాజీ మంత్రి చెల్లుబోయిన విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీ పై కూడా చెల్లుబోయిన విమర్శలు గుప్పించారు. సొంత వారికి సంపద సృష్టించేందుకే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. మద్యం టెండర్లకు దరఖాస్తు ప్రక్రియను రెండు రోజులు పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజలను తాగుబోతులు చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story
null