AP:‘YS జగన్‌కు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా?’..కేంద్రమంత్రి విమర్శలు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-03 15:24:44.0  )
AP:‘YS జగన్‌కు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా?’..కేంద్రమంత్రి విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత మూడు రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వరద బాధితులను ఆదుకోవాలని అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం పై ఇష్టానుసారం విమర్శలు గుప్పిస్తున్నారు అంటూ వైసీపీ అధినేత.

మాజీ సీఎం జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైరయ్యారు. ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ‘వరద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు ఇంటికి, బుడమేరుకు సంబంధం ఏమిటని..ఆ మాత్రం జ్ఞానం కూడా లేకపోతే ఎలా?’ అని ఎద్దేవా చేశారు. విపత్తుల సమయంలో ఎలా పని చేయాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ఇప్పటికైనా మారాలని సూచించారు. లేకపోతే ప్రజలు ఆయనను శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేస్తారని వ్యాఖ్యానించారు. ఏపీని అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed