AP News:వరద ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి పర్యటన

by Jakkula Mamatha |   ( Updated:2024-09-03 15:20:20.0  )
AP News:వరద ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి  పర్యటన
X

దిశ,కనిగిరి:విజయవాడలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనితతో కలిసి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలోని ముంపు ప్రాంతాల్లో బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఆహారం, మంచినీటి ప్యాకెట్లను ముంపు ప్రాంతాల ప్రజలకు అదే విధంగా చర్యలు తీసుకున్నారు.

కనిగిరి ప్రాంతం నుంచి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఐదువేల మందికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మంగళవారం మధ్యాహ్నం ఉగ్ర నరసింహారెడ్డి దగ్గరుండి మంచినీళ్లు, ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఇటువంటి విపత్తులు తలెత్తినప్పుడు మానవతా దృక్పథంతో అందరూ దగ్గరుండి మానవాళికి సహాయ సహకారాలు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. సహాయక చర్యల్లో ఆయన వెంట చీరాల శాసనసభ్యులు ఎం ఎం.కొండయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు, తదితర కనిగిరి ప్రాంత నాయకులు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed