- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home Minister Anitha: జగన్ ఇంకా రోడ్లపై తిరుగుతున్నారంటే ఆయనే కారణం.. హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం జగన్ (Former CM Jagan) ఇంకా రోడ్లపై తిరుగుతున్నారంటే అందుకు కారణం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కరేనని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల (YCP Leaders) అరెస్టులపై హోంమంత్రి అనిత, జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా నీచమైన పోస్టులు పెట్టే వారిని పోలీస్ స్టేషన్ (Police Station)కు కాకుండా ఎక్కడికి తీసుకెళ్లారని బదులిచ్చారు. నాడు వైసీపీ నేతలు (YCP Leaders) అమాయకులపై కేసులు పెట్టి హింసిచారని.. నేడు వారు అరెస్టులపై ఎన్‌హెచ్ఆర్సీ (NHRC)కి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
నేరస్తులకు జగన్ (Jagan) సపోర్ట్ చేస్తున్నారని.. ఇలాంటి వ్యవహారాలను సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోరని అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే పరిణామలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. దేశంలో అంబేద్కర్ (Ambedkar) రాసిన రాజ్యాంగం అమలు అవుతోంది కాబట్టే.. జగన్ (Jagan) ఇంకా రోడ్లపై తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnaraju)పై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. నాడు రాష్ట్రంలో రాజారెడ్డి (Rajareddy) రాజ్యాంగం అమలు చేశారని.. నేడు కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని హోంమంత్రి అనిత (Home Minister Anitha) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.