టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలపై హైకోర్టు కీలక ఆదేశం

by Nagaya |   ( Updated:2023-05-01 07:27:48.0  )
టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలపై హైకోర్టు కీలక ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్-5 జోన్ ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆర్5 జోన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంతంలో 5 వేల టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలివ్వాలని ఆదేశించింది. ఇళ్ల మంజూరులో విధివిధానాలు, పూర్తి రికార్డులను కోర్టు ముందుంచాలని కోరింది. పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వుల అంశంపై రేపటి విచారణలో ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే ఆర్-5 జోన్ పై హైకోర్టులో వాదననలు ముగిశాయి. ఆర్-5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story