పిడుగులతో భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

by Anjali |   ( Updated:2023-05-21 06:34:32.0  )
పిడుగులతో భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మండిపడుతున్న ఎండలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు శుభవార్త తెలిపారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కూరుస్తాయని వెల్లడించింది.

ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని హెచ్చరించారు. అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read...

సాప్ట్‌వేర్ రాధ మర్డర్ కేసులో సంచలన ట్విస్ట్.. అసలు హంతకుడు అతడే..!

Advertisement

Next Story

Most Viewed