జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తా: మంత్రి మేరుగ నాగార్జున

by Seetharam |
జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తా: మంత్రి మేరుగ నాగార్జున
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిల మార్పుపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. వైనాట్ 175 ల‌క్ష్యంగా 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేర‌కు 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించిందని చెప్పుకొచ్చారు. ఈ ఇన్‌చార్జిల మార్పులో భాగంగా మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గ మార్పుపై మంత్రి మేరుగ నాగార్జున తొలిసారి స్పందించారు. వేమూరు నియోజకవర్గం నుంచి తనను తప్పించి సంతనూతలపాడు నియోజకవర్గానికి మార్చడంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడు సార్లు వైఎస్ జగన్ బొమ్మపై గెలిచినట్లు తెలిపారు. ప్రస్తుతం సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్ జగన్‌ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఇన్‌చార్జిల మార్పుల విషయంలో ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అంతా సీఎం వైఎస్ జగన్ కోసం..వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తారని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed