- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Guntur: వైసీపీకి షాక్.. బీజేపీలో చేరిన మైనారిటీ సెల్ నేత
దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఛాంద్ బాషా ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో బీజేపీలో చేరారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఛాంద్ బాషా తన అనుచరులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.
గుంటూరులో కార్పొరేటర్‌గా షేక్ ఛాంద్ బాషా
కాగా షేక్ ఛాంద్ బాషా గుంటూరులో కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్‌లో పీసీసీ కార్యదర్శిగా, మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. అయితే తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నేృతృత్వంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
ముస్లింలకు బీజేపీ రక్షణ కల్పిస్తుంది
షేక్ ఛాంద్ బాషా మాట్లాడుతూ బీజేపీ ముస్లింలకు రక్షణ కల్పిస్తుందని, చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనపట్ల ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు తెలిపారు. సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పీవీఎన్ మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి , బీజేపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ తోట రామకృష్ణ, జిల్లా మాజీ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, కన్నారవి దేవరాజు, ఎం మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.