Polavaram Project: టోన్ మార్చిన వైసీపీ.. ఆలస్యానికి ఆయనే కారణమట

by srinivas |
Polavaram Project: టోన్ మార్చిన వైసీపీ.. ఆలస్యానికి ఆయనే కారణమట
X

శ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దశాబ్ధాలు కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ పోలవరం ప్రాజెక్టు పనుల్లో జోరందుకుంది. ఆయన మరణం అనంతరం జరిగిన పరిణామాలతో ఆ పనులు కాస్త నెమ్మదించాయి. అనంతరం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. సోమవారం పోలవరం అంటూ చంద్రబాబు ఏకంగా ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పోలవరం పూర్తి చేసే విషయంలో డెడ్ లైన్లు విధించారు. అసెంబ్లీ సాక్షిగా రాసుకో నాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాల్ విసిరినా అది పూర్తి చేయలేకపోయారు.


అప్పుడలా...

2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ యాదవ్ సైతం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. ఆయన కూడా డెడ్ లైన్‌లు విధించేశారు. 2022కల్లా పూర్తి చేసి తీరుతామని అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పారు. అనంతరం ఆయనకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకడంతో అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ పదవి వరించింది. అసెంబ్లీ రాసుకో..నోట్ చేసుకో అన్నారు ఆయన ఎక్కడా అంటూ సెటైర్లు వేసినా అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చేతులెత్తేశారు. ఇంకా ఏమైనా ప్రశ్నిస్తే చంద్రబాబు తప్పిదం అని చెప్పుకొస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవ్వడానికి చంద్రబాబు, మానవ తప్పిదమే కారణమని తప్పించుకుతిరుగుతున్నారు.


ఇప్పుడిలా..

తాజాగా అంబటి మాట్లాడుతూ డెడ్‌లైన్లతో పనేంటని చెప్పుకొచ్చారు. డెడ్ లైన్ పూర్తైంది కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదంటూ అసెంబ్లీలో సెటైర్ల మీద సెటైర్లు వేసిన అంబటి రాంబాబు తీరా మంత్రి అయ్యేసరికి డెడ్ లైన్‌లతో అవసరమే లేదని చెప్పుకొస్తు్న్నారు. అంతేకాదు కాస్త ఆలస్యమైనా పూర్తి నాణ్యతతో ప్రాజెక్టు పూర్తి చేస్తానని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుపై అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ పోరును చూస్తున్న ఏపీ ప్రజలు ఎంతో కీలకమైన ప్రాజెక్టును రాజకీయం కోసం వాడుకుంటున్నారంటూ మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed