చిలకలూరిపేట వైసీపీలో కీలక మార్పులు.. రచ్చకెక్కిన నేతలు..?

by srinivas |   ( Updated:2024-03-13 13:59:28.0  )
చిలకలూరిపేట వైసీపీలో కీలక మార్పులు.. రచ్చకెక్కిన నేతలు..?
X

దిశ, వెబ్ డెస్క్: ఇంచార్జుల మార్పు నిర్ణయం కొన్ని నియోజకరవర్గాల్లో అసలుకే ఎసరు తెచ్చి పెడుతోంది. ముందు ఒకరిని ప్రకటించి ఆ తర్వాత మరొకరిని నియమించడం పెచీలకు, పంచాయితీలకు ఆజ్యం పోసింది. ఇలా గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో అసమ్మతిరాగం భారీగా పెరిగింది. చిలకలూరుపేటలో గత ఎన్నికల్లో మంత్రి విడుదల రజినీ గెలుపొందారు. అనంతరం ఆమె మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే మూడు నెలలక్రితం మంత్రి విడుదల రజినీని గుంటూరు టౌన్ ఇంచార్జిగా నియమించారు. దీంతో ఆ నియోజకవర్గం ఇంచార్జిగా వైసీపీ అధిష్టానం మల్లెల రాజేష్ నాయుడును నియమించింది. ఈ మేరకు నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

అయితే సడెన్‌గా సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చిలకలూరిపేట ఇంచార్జిగా కావటి మనోహర్ నాయుడికి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఒక్కసారిగా అసమ్మతిరాగం బయటపడింది. తొలుత తనను ఇంచార్జిగా ప్రకటించి ఇప్పుడు మరొకరిని నియమించడంతో మల్లెల రాజేష్ నాయుడుతో పాటు ఆయన వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనోహర్ నాయుడికి సహకరించలేదని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మల్లెల రాజేష్‌నే చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టారు. చిలకలూరిపేటలో ఇంకెవరికి సీటు ఇచ్చినా ఓడిపోవడం ఖాయమంటూ హెచ్చరించారు.

Read More..

శవాలపై పేలాలు ఏరుకునే పార్టీకి రేపు ఇంకెవరో..? వైరల్ అవుతున్న పోస్టర్

Advertisement

Next Story

Most Viewed