చంద్రబాబే ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం: Payyavula

by srinivas |
చంద్రబాబే ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం: Payyavula
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబే ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయమని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. తమకు సంఖ్యా బలం ఉందని, వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా వాళ్ల నాయకత్వంపై నమ్మకం లేదని విమర్శించారు. టీడీపీ సీట్లు 23 అని స్పష్టంగా కనిపిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇప్పుడు రిపీట్ అయ్యాయని పయ్యావుల పేర్కొన్నారు.

కాగా ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో అసెంబ్లీలో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలున్నారు. అయినా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగారు. దీంతో టీడీపీ అభ్యర్థి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆమె విజయం ఈజీ అయిందని స్పష్టమైంది


👉 Read Disha Special stories


Next Story

Most Viewed