- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sattenapalli: మంత్రి అంబటిపై కేసు నమోదు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. మంత్రి అంబటిపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు కోర్టు ఆదేశాలతో మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పీఎస్‌లో గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. కాగా మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి డ్రా పేరుతో సత్తెనపల్లిలో బలవంతంగా టికెట్లు అమ్మించి.. అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే కేసు నమోదు చేయకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వెంకటేశ్వరరావు పిల్‌పై కోర్టు విచారణ జరిపింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇటీవలే మంత్రి అంబటి రాంబాబు తన నియోజకవర్గంలోని ఓ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం నుంచి లంచం అడిగారని అరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన మరువకముందే సంక్రాంతి డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడం.. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
కాగా సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు చిందేశారు. తనదైన హావభావాలతో డాన్సులు ఇరగదీశారు. బంజారాలతో కలిసి సంప్రదాయ నృత్యాలతో అలరించారు. భోగి వేడుకల్లో సందడిగా గడిపారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా మంత్రి అంబటి నృత్యం చేస్తున్నంతసేపు నాయకులు, కార్యకర్తలు, చప్పట్లు, విజిల్స్ మోత మోగించారు. ప్రస్తుతం అంబటి రాంబాబుకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.