Breaking: మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి

by srinivas |   ( Updated:2024-10-17 10:40:28.0  )
Sajjala Ramakrishna Reddy Says, YSRCP wont alliance with BJP
X

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి టీడీపీ కార్యాలయం(Mangalagiri TDP office)పై దాడి కేసులో విచారణకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(YCP leader Sajjala Ramakrishna Reddy) హాజరయ్యారు. ఈ మేరకు ఆయన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల 120వ నిందితుడిగా ఉన్నారు. దీంతో సజ్జలకు బుధవారం నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఇవాళ విచారణకు రావాలని పేర్కొన్నారు. దీంతో విచారణకు సజ్జల హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌(Nandigam Suresh)ను రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితులను సైతం విచారిస్తున్నారు. ఇప్పటికే దేవినేని అవినాశ్‌(Devineni Avinash)తో పాటు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డిని విచారించారు.

కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) అధికారంలో ఉండగా 2021 అక్టోబర్ 19న మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినా విచారణ జరపలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు విచారణలో దూకుడు పెంచారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు.. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story