- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మధుమేహంతో నేత్ర సమస్యలు: డాక్టర్ ఆర్.కల్పనా రెడ్డి

దిశ, గుంటూరు: మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే నేత్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అగర్వాల్ ఐ హాస్పిటల్ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ ఆర్.కల్పనా రెడ్డి అన్నారు. ప్రపంచం మధుమేహ నిరోధక మాసం సందర్భంగా గుంటూరు బ్రాడీపేట ఎస్‌హెచ్‌ఓ భవనంలో నిర్వహించిన రెటినోపతి ఉచిత పరీక్ష-వైద్య సలహా శిబిరంలో ఆమె మాట్లాడారు. అత్యంత సున్నితమైన భాగం రెటీనా అని, ఇది 10 పొరలతో నిర్మితమై ఉంటుందన్నారు. మధుమేహం ఉన్న వారిలో రక్తంలో షుగర్ శాతం అధికంగా ఉండడం వల్ల హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నవారిలో ఆ సున్నిత రక్తనాళాలలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. అంటే రక్తనాళాలు సన్నబడి పోవడం, బలహీన పోవడం, కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం వంటి కారణాల వల్ల రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. మధుమేహ బాధితుల్లో రెటీనాలో వచ్చిన ఈ విధమైన మార్పులనే "డయాబెటిక్ రెటినోపతి"గా పేర్కొంటారన్నారు. మధువేహం, అధిక రక్తపోటు ఉన్న వారు ప్రతి ఆరు నెలలకోసారి రెటినోస్కోపీ పరీక్ష చేయించుకోవడం చాలా మంచిదన్నారు.
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్స్ చైర్మన్ టి.ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టి, ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా వ్యాధులను నిరోధించేలా ప్రజలను చైతన్యం చేసేందుకు తమ సంస్థలు ఈ వైద్య శిబిరాలు, అవగాహన సభలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ పీఆర్ఓ సుధాకర్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి వి.సుబ్రహ్మణ్యం, కోశాధికారి టీ.వీ.సాయిరాం సభ్యులు సీహెచ్ శివాజీ, సిహెచ్.లక్ష్మి సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు