MP Raghurama Case: ఆ కాల్‌ డేటా భద్రపర్చండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

by srinivas |   ( Updated:2023-05-12 14:41:46.0  )
MP Raghurama Case: ఆ కాల్‌ డేటా భద్రపర్చండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన కస్టోడియల్ టార్చర్‌పై సీబీఐ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారించింది. కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్‌ డేటాను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని సీబీఐకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది.

అయితే టెలికం నిబంధనల ప్రకారం రెండేళ్లు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామ కృష్ణంరాజు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాథ్ వాదనలు వినిపించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ సీఐడీ వద్దనే ఉందని...అందుకే కాల్ డేటా కూడా సీఐడీ అధికారులే సేకరించాలని సీబీఐ తరఫు న్యాయవాది హరినాథ్ కోర్టుకు తెలిపారు.

సీబీఐ న్యాయవాది వాదనలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఆరోపణలు చేసింది సీఐడీ మీదే అయితే, కాల్ డేటా సేకరించాలని ఆ సంస్థను ఎలా ఆదేశిస్తామని ప్రశ్నించింది. ఇకపోతే ఈ కేసులో సీఐడీ అధికారులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కాల్ డేటా సేకరించాలని చెప్పడం చట్టవిరుద్ధమని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

అయితే సీఐడీ ఇంప్లీడ్ పిటిషన్‌ను ఇంకా అనుమతించలేదని హైకోర్టు తెలిపింది. ఈ కేసు దర్యాప్తు సీబీఐకు ఇవ్వాలా.? లేదా అనేది కోర్టు ఇంకా నిర్ణయించలేదని...ఈ కేసులో కాల్ డేటా కీలకమని ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ అన్నారు. దీంతో వెంటనే కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

MLA Mekapati Vikram Reddyకి షాక్.. విచారణకు ట్రైబల్ కమిషన్ ఆదేశం

Advertisement

Next Story