మంత్రి రోజాకు ఆ దమ్ముందా: Mlc Anuradha

by srinivas |   ( Updated:2023-10-24 11:27:47.0  )
మంత్రి రోజాకు ఆ దమ్ముందా: Mlc Anuradha
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు కుంటుంబపై మంత్రి రోజా చేసిన కామెంట్లకు ఎమ్మెల్సీ అనురాధ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఫ్యామిలీపై మాట్లాడేటప్పుడు మంత్రి రోజా తన స్థాయింటో తెలుసుకోవాలన్నారు. ఒక ఆడపడుచు అయి ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరిదకాదన్నారు. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయినా ఇప్పుడు మంత్రి రోజాకు వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. దమ్ముంటే రోజా ఆస్తులపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. సీఎం జగన్ పై ఉన్న కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణ త్వరగా చేయాలని కోరే దమ్ముందా అని ప్రశ్నించారు. ఉదయం ఎక్సర్‌సైజులు చేయడం.. మధ్యాహ్నం నాన్ వెజ్ తినడం, రాత్రి పుల్ పార్టీలు చేసుకోవడం తప్ప.. నగరికి మంత్రి రోజా ఏం చేసిందో చెప్పగలదా అని నిలదీశారు. 16 కార్లు, నాలుగు పెట్రోల్ బంకులు, ఎస్సీ, ఎస్టీ ఎసైన్డ్ భూములను మంత్రి రోజా లాక్కున్నారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. అనకొండల్లా నగరిలో మంత్రి రోజా, ఆమె అన్నదమ్ములు దోచుకుంటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నగరి ప్రజలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ అనురాధ హెచ్చరించారు.

Next Story

Most Viewed