Mlc Elections: క్రాస్ ఓటింగ్ ప్రచారంపై ఎమ్మెల్యే శ్రీదేవి ఆగ్రహం

by srinivas |
Mlc Elections: క్రాస్ ఓటింగ్ ప్రచారంపై ఎమ్మెల్యే శ్రీదేవి ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో అసెంబ్లీలో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలున్నారు. అయినా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగింది. దీంతో టీడీపీ అభ్యర్థి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆమె విజయం ఈజీ అయిందని స్పష్టమైంది. అయితే ఈ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రచారం జరుగుతోంది.

దీంతో ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తనకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళలననే చులకనగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తానకిచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేశామన్నారు. రహస్య ఓటింగ్‌లో పేరు ఎలా చేబుతారని ప్రశ్నించారు. గురువారం ఉదయమే తన కుమార్తెతో కలిసి సీఎం జగన్‌ను కలిశానని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed