Target Pawan: ఎలా ఊరుకుంటాం?.. జనసేన నేతలకు అంబటి స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2023-04-06 14:09:10.0  )
Target Pawan: ఎలా ఊరుకుంటాం?.. జనసేన నేతలకు అంబటి   స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మంత్రి అంబటి రాంబాబు మరోసారి టార్గెట్ చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఢిల్లీ టూర్‌పైనా అంబటి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సూచన మేరకే పవన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని అంబటి విమర్శించారు.

అటు పోలవరం నిర్మాణంపైనా మంత్రి అంబటి స్పందించారు. పోలవరంపై నాదెండ్ల మనోహర్ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పోలవరంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేది లేదని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు అస్తవస్తం చేశారని వ్యాఖ్యానించారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణమని అంబటి పేర్కొన్నారు. గొడవ చేయడానికే జనసేన నేతలు పోలవరం వెళ్తే ఎలా ఊరుకుంటామని హెచ్చరించారు. పోలవరం పునరావాసానికి కేంద్రప్రభుత్వమే నిధులు ఇవ్వాలని మంత్రి అంబటి తెలిపారు.

Read more :

సీఎం జగన్ ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి విడదల రజిని

Advertisement
Next Story

Most Viewed