Ap News: జగనన్న సురక్ష పథకం.. ఈ నెల 23 నుంచే షురూ

by srinivas |   ( Updated:2023-06-14 11:50:57.0  )
Ap News: జగనన్న సురక్ష పథకం.. ఈ నెల 23 నుంచే షురూ
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 23 నుంచి జులై 23 వరకు జగనన్న సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ పథకం అమలుపై సంబంధిత కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. అర్హులను గుర్తించి వారికి ఆగస్టు 1 నుంచి పథకాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కల్తీ విత్తనాల పట్ల అలర్ట్‌గా ఉండాలన్నారు. ఎక్కడైనా కల్తీ కనిపిస్తే కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. గ్రీవెన్స్ రిజెక్ట్ చేస్తే ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారుడు ఇంటికెళ్లి వివరించాలని సూచించారు. ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగంగా పెంచాలని, త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed