- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cm Jagan: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ఉండటంతో తన వ్యూహాలకు పదునుపెడ్డుతున్నారు. వైసీపీ నేతలు ప్రతినిత్యం ప్రజల్లో ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర పేరుతో మంత్రులను నియోజకవర్గాలకు పరిమితం చేవారు. అలాగే ప్రజలకు ఆకర్షించేందుకు వివిధ రకాల పథకాలతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అధికారులను సమాయత్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసం అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కడ అభివృద్ధి అవసరమో అక్కడ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి, కడప, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, విశాఖ సహా వివిధ కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. నగరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామని అధికారులకు సీఎం జగన్ వివరించారు. పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేకంగా ఎస్ఓపీ ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.