Amaravati: సీబీఐ కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ.. జగన్, విజయసాయికి ఊరట వస్తుందా...?

by srinivas |   ( Updated:2023-08-30 15:05:07.0  )
Amaravati: సీబీఐ కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ.. జగన్, విజయసాయికి ఊరట వస్తుందా...?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ సెప్టెంబర్ 2న విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని దాఖలైన పిటిషనపై విచారణ గురువారానికి వాయిదా పడింది. తాను యూకేకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరపున హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లొద్దన్న బెయిల్ షరతులను సడలించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన కోర్టు ఇరువర్గాల వాదనలను వినింది. అటు సీబీఐ కూడా తన వాదన వినిపింది. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొదని కోర్టుకు పేర్కొంది. ఇరువర్గాల వాదనలు ముగియడంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమర్తె వద్దకు వెళ్లేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ షరతులు సడలించాలని కోరారు.

మరోవైపు విజయసాయిరెడ్డి కూడా సీబీఐ కోర్టును ఆశ్రయించారు. విదేశాలకు వెళ్లేందుకు తనకు సైతం అనుమతివ్వాలని పటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పైనా వాదనలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్నీ కోర్టు గురువారం వెలువరించనుంది.

Advertisement

Next Story