- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పకడ్బందీగా టెన్త్, ఇంటర్, ఒకేషనల్ పరీక్షలు: కలెక్టర్ రంజిత్
దిశ ప్రతినిథి, బాపట్ల: పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఒకేషనల్ పరీక్షలను సమర్థవంతంగా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అనుబంధ శాఖల అధికారులతో గురువారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ముందుగా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అనుబంధ శాఖల అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఒకేషనల్, టెట్, డీఎస్సీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సమగ్ర ప్రణాళికతో అధికారులు బాధ్యతగా పని చేయాలని మంత్రి సత్యనారాయణ సూచించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్న గాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు ముందస్తు ప్రణాళిక ఉండాలని, పరీక్షలు సమర్థంగా నిర్వహించాలని తెలిపారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, సురేష్ మాట్లాడగా జిల్లా నుంచి కలెక్టర్ రంజిత్ బాషా, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ డివైస్, ఫోన్, వాచీలు వంటి పరికరాలు ఏవి అనుమతించరాదన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపితే ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలన్నారు. ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలన్నారు. మొబైల్ పోలీస్ వాహనాలు ఆయా కేంద్రాల వద్ద పర్యవేక్షించేలా చూడాలన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించాలన్నారు. పరీక్షలు ముగిసే వరకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ప్రాథమిక వైద్య కిట్టులు సిద్ధం చేసుకోవాలన్నారు. 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూత వేయించాలని ఆదేశించారు. పరీక్షలకు ముందు ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచాలని, పరీక్షలు ముగిసిన తదుపరి ప్రశ్నాపత్రాలను భద్రపరచాలన్నారు. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లు జిల్లా కేంద్రాలలోనే ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు 35 కేంద్రాల్లో జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనుండగా, జిల్లా నుంచి 19,853 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను రెండు, కస్టోడియన్స్, సిట్టింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్ ఎస్ సి పరీక్షలు 108 పరీక్షా కేంద్రాలలో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయని కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరిగే పరీక్షలకు 18,910 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. అందులో 9,781 మంది బాలురు, 9,129 మంది బాలికలు ఉన్నారన్నారు. పదో తరగతి పరీక్షల కొరకు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆరు బృందాలు, ప్రాథమిక వైద్య కిట్లు, 216 మంది ఏఎన్ఎంలను నియమించమన్నారు.
ఒకేషనల్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెల 18 నుంచి 30వ తేదీ వరకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30గంటల వరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. 1,204 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
పరీక్షల షెడ్యూల్ ఇదే..