Breaking: ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్

by srinivas |   ( Updated:2023-04-26 15:20:45.0  )
Breaking: ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌కు 4,33,275 లక్షల మంది,సెకండియర్‌కు 3,79,750 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.. ఈ పరీక్ష జరిగిన 22 రోజుల్లో ఫలితాలు విడుదల చేశారు. అయితే ఫస్టియర్ ఉత్తీర్ణత 61 శాతం కాగా, సెకండియర్ 72 శాతంగా ఉంది. ఫస్టియర్‌లో 2,66,326 మంది పాస్ కాగా.. సెకండియర్‌లో 2,72,001 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

బాలికలే టాప్

కాగా మొదటి సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత 65 శాతం, బాలుర ఉత్తీర్ణత 58 శాతంగా ఉంది. సెకండియర్‌లో ఉత్తీర్ణత 75 శాతం, బాలుర ఉత్తీర్ణత 68 శాతంగా నమోదు అయింది. ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా పాస్ అయ్యారు. అత్యల్పంగా కడప విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యారు. సెకండియర్ ఫలితాల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 83 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అత్యల్పంగా విజయనగరంలో నమోదు అయింది. అయిదే ఫస్ట్ అండ్ సెకండియర్‌లోనూ బాలికలే టాప్ రావడం విశేషం.

bieap.apcfss.in.ap ద్వారా రిజల్స్ చూసుకోవచ్చు..

అయితే పరీక్షలు ముగిసిన వెంటేనే స్పాట్ వేల్యూషన్ నిర్వహించినట్లు మంత్రి బొత్స తెలిపారు. గత సంవత్సరం కంటే మిన్నగా సంతృప్తిగా పరీక్షలు, పేపర్ వేల్యూషన్ నిర్వహించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు bieap.apcfss.in. ap. అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని తెలిపారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అవకాశం కల్పిస్తున్నామని... పాస్ కాని వారికి సప్లమెంటరి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కావాల్సి వుంది. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట ఆలస్యంగా ఫలితాలను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3వరకు జరిగాయి. ఇక సెకండియర్ విషయానికి వస్తే మార్చి 16 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : బిగ్ బ్రేకింగ్: ఇంటర్ ఫలితాలు విడుదల

Advertisement

Next Story

Most Viewed