కస్టడీకి నందిగం సురేశ్.. టెన్షన్‌లో అనుచరులు

by srinivas |
కస్టడీకి నందిగం సురేశ్.. టెన్షన్‌లో అనుచరులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌(Nandigam Suresh)ను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆయనను రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో హైకోర్టు (High Court) అనుమతి జారీ చేసింది. దీంతో నందిగం సురేశ్‌ను కస్టడీకి తీసుకుని ఆదివారం పోలీసులు ప్రశ్నించనున్నారు.

ఈ మేరకు నందిగం సురేశ్‌ను కాసేపట్లో జైలు నుంచి బయటకు తీసుకురానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పోలీస్ కార్యాలయంలో విచారించనున్నారు. అయితే పోలీసు కస్టడీ (Police Custody)లో నందిగం సురేశ్‌ను ప్రశ్నించే సమయంలో ఆయన తరఫు లాయర్ సైతం అక్కడ ఉండొచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాదు ఈ సురేశ్‌పై ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని సూచించింది. మరోవైపు నందిగం సురేశ్ అనుచరులు టెన్షన్‌ పడుతున్నారు. కస్టడీలో తమ నేతను ఇబ్బందులకు గురి చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. కోర్టు ఆదేశాలతో నందిగంకు ప్రశ్నలు మాత్రమే సంధిస్తారని సహచరులు చెబుతున్నా ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Next Story